About SLVST

Trust Leaders

Member 1

Dr GAREPALLY NAVEEN KUMAR

Sri Lakshmi venketshwara seva trust Prisdent
MAHABUBABAD DISTRICT TELANGANA STATE

Member 2

KOTHURI LEELAVATHI

Sri Lakshmi venketshwara seva trust vice secretary kothuri leelavathi

నా పేరు కొత్తూరి లీలావతి నేను నైనాలలో గ్రామములో 20-8-1978 పుట్టాను ఇప్పుడు మహబూబాబాద్ లో ఉంటున్నాము నా భర్త పేరు కొత్తూరి శ్రీనివాస్ నేను శ్రీ లక్ష్మి వెంకటశ్వరా సేవ ట్రస్టులో సెక్రటరీగా సేవలు అందిస్తున్నాను నేను 2015 ఇ సేవ ట్రస్టులో నోముల సుజాత గారి ధ్వారా ట్రస్టులో చేరడం జరిగింది తరవాత నవీన్ గారు వైస్ సెక్రటరీగా నియమిచ్చారు నేను అందించే సేవలను చూసి నన్ను వైస్ ప్రసూడెంట్గా చేశారు ఇప్పుడు సెక్రటరీగా వున్నాను.మా సేవట్రస్ట్ ద్వారా ఎనో సేవలు చేయడం జరుగుతుంది హుండీ లెక్కింపులు చేయడం అనాధ పిల్లలకు ఆహారం ఇస్తుంటాము మా సేవ ట్రస్ట్ ధ్వారా ఎనో టెంపుల్స్లో సేవ చేసే అవకాశం ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం 15ఆగస్టు మరియు జనవరి 26 రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నాము ఎండాకాలంలో మజ్జిగ పంపిణి చేస్తుంటాము ఇ మధ్యనే వరంగల్ భద్రకాళీ అమ్మవారి టెంపుల్లో 3.000 మందితో ర్యాలీచేసి అమ్మవారికి కూరగాయలు సమర్పించటం జరిగింది మన సేవట్రస్ట్ ధ్వారా ఇంకా ఎనో సేవలు సమాజానికి అందించాలనేదే మన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవ ట్రస్ట్ ఒక్క ముఖ్య ఉదేశ్యం మీ అందరికి ఇంత చక్కటి అవకాశం రావలని మనసుపుస్తిగా కోరుకుంటున్నాను ఇట్లు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవ ట్రస్ట్ సెక్రటరీ కొత్తూరి లీలావతి 🙏

Member 3

MANCHALA YADAGIRI GARU

Sri Lakshmi venketshwara seva trust Treasure Manchala yadagiri garu

నా పేరు మంచాల యాదగిరి నేను పుట్టినది 14-12-1977 కొత్త రెడ్యాల గ్రామం మండలం మహబూబాబాద్ జిల్లా మహబూబాద్ నేను 2018లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ లో సభ్యునిగా చేరినాను నేను అప్పటినుంచి సేవా ట్రస్ట్ కు ఎన్నో కార్యక్రమాలకు చేశాను సేవలు కూడా చేశాము నాకు మా ప్రెసిడెంట్ అయిన గర్రెపల్లి నవీన్ కుమార్ గారు అంకుల్ గారు మీరు ట్రెజరర్ గా ఉండండి అని నాకు చెప్పినాడు అయితే మా సేవ ట్రస్ట్ 30 మంది సభ్యులందరూ కలిసి డబ్బులు తీసుకోవడం గాని వాళ్లకు ఖర్చు గాని జమ గాని చెప్పడం అనేది జరుగుతుంది. నా వంతు సహకారం నేను చేస్తున్నాను ఇట్లు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ట్రెజరర్ మంచాల యాదగిరి.నా హయాంలో మా సేవా ట్రస్ట్ అందరి సహాయ సహకారంతోటి సేవ సదన్ నిర్మించాము అదేవిధంగా నేను చేసిన సేవను గుర్తించి తెలుగు సాంస్కృతి సాహితీసేవ ట్రస్ట్ వారు నాకు అవార్డు రావడం జరిగింది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ నా నాకున్న పదవి కాలంలో నేను చేసిన కార్యక్రమాలు మూగజీవాలకు ఆహారంపెట్టడం అనేది జరిగినది అలాగా కరోనా టైం లో కూడా వలస బాధితులకు కూరగాయలు వాళ్లకు సరిపడా వస్తువులు ఇవ్వడం అనేది జరిగింది ఇట్లు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ట్రెజరర్ మంచాల యాదగిరి

Member 4

DAGGULA SUJATHA

Sri Lakshmi Veketswara SevaTrust Vice President: Daggula sujatha Mahabubabad District Telangana State

నా పేరు దగ్గుల సుజాత మహబూబాబాద్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను 16లో సేవా ట్రస్టు లో జాయిన్ అవ్వడం అన్నది జరిగింది అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో వందల సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు అందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది మరియు ఈ సేవా ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మందికి సేవకు అవకాశం ఇచ్చి ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షాలు కలిగిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము అందరము కలిసి సేవా ట్రస్ట్ డెవలప్మెంట్ కోసం అనేక సేవా కార్యక్రమాలు కాకుండా కరోనా సమయంలో పేద ప్రజలకి నిత్యావసర వస్తువులను అందించడము మరియు మూగజీవులకు పండ్లు ధాన్యము లాంటివి కూడా పెట్టడం జరిగింది మరియు మీ సేవ ట్రస్ట్ ద్వారా నన్ను గుర్తించి ఆ వాట్సప్ కూడా రావడం జరిగింది అందుకు నేను ఎంతో గర్విస్తున్నాను ఈ సేవా ట్రస్ట్ ద్వారా జూలై నెలలో ప్రసిద్ధి చెందిన హన్మకొండలోని భద్రకాళి దేవస్థానంలో సేవా ట్రస్టు ద్వారా 3000 మందితో శాఖాంబరి ఉత్సవాల కార్యక్రమాలలో భాగంగా కూరగాయలను తీసుకొని పోచం మైదానం నుండి అమ్మవారి టెంపుల్ దాకా ర్యాలీగా వెళ్లడం జరిగింది. ఇంత చక్కటి ప్రోగ్రాంలో నేను ఉండడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సేవ ట్రస్ట్ దినదిన అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి లీడర్స్ కి మరియు నెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు

Member 5

PAKA PADMAVATI

Sri Lakshmi venketshwara seva trust vice secretary paka padmavati

నా పేరు పాక పద్మావతి ఊరు మహబూబాబాద్ డిస్టిక్ పుట్టిన తేదీ06/01/1983 నేను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ లో 2019 లో సభ్యురాలిగా జాయిన్ అవ్వడం జరిగింది తరువాత నేను చేసే సేవలు చూసి గర్రెపల్లి నవీన్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు నాకు వైస్ సెక్రటరీగా లీడర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది మా ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ నుండి ఎన్నో గుళ్ళల్లో ఎన్నో లక్షల మందికి సేవకు అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది మా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ 2015 లో ప్రారంభమై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలో అడుగుపెట్టి ఎన్నో లక్షల మందికి సేవకు అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంత చక్కటి మా ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ లో నేను లీడర్ గా ఉండడం ఎంతో గర్వకారణం అంతేకాకుండా నేను కూడా నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను సభ్యురాలుగా ఉన్నప్పుడు ఒకరి చెబితే సేవకు వెళ్ళేదాన్ని సేవ చేసుకోవడం అనేది మన పుణ్యం అండి అన్ని సేవలకు అవకాశం ఇస్తూ ఉన్న మన ఈ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు

Member 6

BELIDE KOUSHIK

నా పేరు బెలేదే కౌశిక్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ప్రి ఆరో నాకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ అనేది 2021 తిరుపతి దర్శనానికి ఈ ట్రస్ట్ సభ్యులతో వెళ్లడం జరిగింది అప్పుడు ఈ ట్రస్ట్ సభ్యులతో అనుబంధం అనేది ఏర్పడడం జరిగింది అప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది నేటి వరకు అందరితో సేవలు చేయిస్తూ ప్రతి ఒక్క దేవాలయంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు అందిస్తూ గ్రూపులో పెట్టడం జరిగింది అలాగే నా పనితనాన్ని గుర్తించి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శివ ట్రస్టులో పిఆర్ఓ గా పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది నాకు చాలా సంతోషదాయకం నేను నా కర్తవ్యాలను యధావిధిగా నిర్వర్తిస్తానని కోరుకుంటున్నాను

Member 7

THEEGALA NAVEEN

Sri Lakshmi venketshwara seva trust cheif election officer
MAHABUBABAD DISTRICT TELANGANA STATE

లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తీగల నవీన్ గారు మన లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ కి ఎన్నో సహాయ సహకారాలు చేయడం జరిగింది మరియు ఇవాళ మా లక్ష్మి వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా భద్రకాళి దేవస్థానం కాడ సేవా సదన్ నిర్మించడానికి మాకు తోడుగా ఉన్నాడు మరియు వెబ్సైట్ లాంచింగ్ చేయడానికి కూడా సహాయ సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా మా వ్యవస్థని ఒక గుర్తింపు వచ్చే స్థాయికి తెచ్చిన వ్యక్తి ఎవరు అంటే తీగల నవీన్ గారిని చెప్పవచ్చు ఎందుకంటే మాతోపాటు ఒక సేవకు రావడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం కి మరియు ద్వారక తిరుమల కూడా రావడం జరిగింది మాకు ఒక వెల్విషర్ గా ఉంటాడు తీగల నవీన్ గారు ఎందుకంటే మా యోకా వ్యవస్థ అంటే నమ్మకం మేము చేసే కార్యక్రమాలను చూసి సారు మాకు ఇంత చక్కటి అవకాశం ఇవ్వడం జరిగింది మా లక్ష్యం వెంకటేశ్వర సేవా ట్రస్ట్ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు

Member 8

AKULA PRABHU KUMAR

Sri Lakshmi Venkateshwara Seva Trust program convener Akula Prabhu Kumar Mehboobad district

నా పేరు ఆకుల ప్రభు కుమార్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ చేరి గత ఐదు సంవత్సరాలు కాబోతుంది ఈ సేవ ట్రస్ట్ లో చేరినప్పటి నుంచెల్లి ఎన్నో కార్యక్రమాలు పాల్గొనడం జరిగినది కరోనా టైం లో మూగజీలకు ఆహారం గాని వికలాంగులకు నిత్యవసర వస్తువులు గాని 26 జనవరి రోజు గానీ ఆగస్టు 15 రోజులని ఫ్లాగ్ ఇష్టం చేయడం అనే జరిగినది సేవ డ్రెస్ సెలబ్రేషన్ అనేక టూర్లు పోవడం జరిగినది ఇందులో యంగ్ అండ్ డైనమిక్ డాక్టర్ నవీన్ కుమార్ గారు సేవ ట్రస్ట్ అధ్యక్షులు నాకు చిన్న పదవి ఇవ్వడం జరిగినది సేవా ట్రస్ట్ ప్రోగ్రాం కన్వీనర్ గా చేయడం జరుగుతుంది నా మీద నమ్మకం పెట్టుకొని ఇంతటి చక్కటి పదవి ఇచ్చినందుకు పద్ధతి తగ్గట్టుగా పనిచేస్తానని నీ వెంట నేను ఉంటానని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రస్ట్ లీడర్లకు సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు

Member 9

T KARUNAKAR GUPTA

నా పేరు తడకమల్ల కరుణాకర్ నేను హైదరాబాద్ లో ఉంటాను. మొట్ట మెదలు నాకు నవీన్ కుమార్ సారు 2023వ సంవత్సరంలో ఫోన్ లో పరిచయం కావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వారకు ఈ యొక్క సంస్థ రోజు రోజుకి దినాభివృద్ధి చెందుతునే ఉంది. ఇది అంత కూడా అధ్యక్షుల ప్రోత్సాహం వల్ల అని కూడా చెప్పువచ్చు. నేను ఇప్పటి వరకు ఇంత చిన్న వయసులో ఇన్ని సేవలు ఇంత మంచిగా చేయడం చాలా అరుదుగా చూసాను. నేను ఇప్పటికి చాలా సేవా సంస్థలకు వివిధ రకాల పోస్టులకు భాద్యత వహిస్తూన్నాను కాని ఇలా ఎవరికీ ఇబ్బంది లేకుండా చేయడం చూడలేదు. ఇవన్నీ చూసిన తరువాత నాకు ఒకటి అనిపించింది. మరి నేను కొన్ని స్వచ్ఛంద సేవ సంస్థలకు సపోర్ట్ చేస్తున్నాను మరి లక్ష్మి వెంకటరశ్వర సేవా ట్రష్టుకి కూడా చేస్తే బాగుంటుంది అనుకున్న తరుణంలో మన సంస్థ అధ్యక్షుల వారు నన్ను కూడా సంస్థలకు తీసుకోవడం జరిగింది. నేను అధ్యక్షులకు పరిచయం అయినా కొద్దీ కాలానికే నన్ను సంస్థలకు తీసున్నాందుకు వారికి చాలా ధన్యవాదములు. మరి సంస్థలో నాకు ఇచ్చిన పోస్టు చాలా వాల్యూబులుగా కూడా ఇచ్చారు. మరి స్వీకరించినందుకు నేను చేయవలసిన భాద్యతగా లక్ష్మి వేంకటేశ్వర సీవా ట్రస్టు యొక్క అకౌంట్స్ మరియు ఆడిట్స్ అదేవిదంగా ఇన్కమ్ టాక్స్ సెక్షన్స్ లాంటి కార్యక్రమాలే కాకుండా ఫండ్ డెవలప్మెంట్, ఫండ్ క్రియేషన్, ఫండ్ ప్లానింగ్ కార్యక్రమాలలో భాద్యత తీసు కుంటాను. అయినా నవీన్ సారు చేసే సేవలో ఇది చాలా తక్కువే అని కూడా చెప్పవచ్చు. ఈ సంస్థ 123 సేవ సంస్థలలో 3వ స్థానంలో ఉంది దీనిని మనందరం కలిసి మెదటి స్థానానికి తీసుకోనివేళాలి అని భావిస్తున్నాను. లక్ష్మి వేంకటేశ్వర సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఇంకొక కొత్త సేవ వివిధ రకాల సంస్థలకు టాక్స్ ఆడిట్స్ మరియు అకౌంట్స్, ఇన్కమ్ టాక్స్ సెక్షన్ సెట్టిఫికెట్స్, ఫండ్ ప్లానింగ్, ఫండ్ క్రియేషన్,ధర్పన్ లాంటి పనులు కూడా చేయబడును. కాంటాక్ట్ నెంబర్ 8143754847

Member 10

A VEERAIAH

జైశ్రీరామ్ అండి నా పేరA వీరయ్య మా మా సొంత ఊరు ఖమ్మం గ్రామం కొన్ని రోజుల తర్వాత మహబూబాబాద్ లో స్థిరపడ్డాను అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో సేవ చేసి వచ్చిన తర్వాత మహబూబాబాద్ లో కూడా ఒక మిత్రుడు నవీన్ కుమార్ గారు సుధాకర్ గారు పరిచయం అవ్వడం జరిగింది ఒకసారి నేను నవీన్ కుమార్ ని సేవకు పంపడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం కి అక్కడ సేవ చేసి వచ్చినంక ఆయనకు చానా సంతోషం కనిపించిందంట మన మహబూబాబాద్ లో కూడా ఒక వ్యవస్థ ప్రారంభంబించాలని ఆలోచన రావడం జరిగింది ఆయన నా దగ్గరకు వచ్చి కలవడం జరిగింది. అప్పుడు ఆయనకి నేను వ్యవస్థ ఎలా ప్రారంభంబించాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పటివరకు కూడా ఇలాంటి ఆటంకాలు రాకుండా కొన్ని వేల మందికి సేవ అవకాశం కల్పించడం జరుగుతుంది నవీన్ కుమార్ గారు చానా దేవాలయంలో కూడా మన లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ దినదిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు నాకు చాలా సంతోషకరం అనిపిస్తుంది ఎందుకంటే నేను పెట్టిన వ్యవస్థ ప్రారంభం మించినందుకు ఈ వ్యవస్థ ఇంత గొప్ప స్థితిలో ఉండడం నాకు చాలా గర్వ కారణం ఎందుకంటే ఎవరి స్వార్థం వారు చూసుకోకుండా నవీన్ కుమార్ అనే వ్యక్తి అందరికోసం కష్టపడి కొన్ని లక్షల మందికి సేవ అవకాశం ఇవ్వడం కోసం తాపత్ర పడుతుందో ఎందుకంటే ఇవాళ ఉన్న సమాజంలో సంపాదన మరియు ఉద్యోగం మరియు వ్యాపారం గురించే ఆలోచిస్తారు కానీ నవీన్ కుమార్ అనే వ్యక్తి అలా కాకుండా సేవ చేసే వాళ్ళు పెరగాలే సేవకు వచ్చేవారు పెరగాలే సేవ గుర్తింపు వచ్చే విధంగా చేయాలని నవీన్ కుమార్ కి చానా ఇంట్రెస్ట్ గా ఉంది ఆయనని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తది ఈ యొక్క వ్యవస్థ రావే రోజులలో ఒక గవర్నమెంట్ దృష్టిలో వెళ్లి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా భగవంతున్ని ఎందుకంటే ఇంత మంచి చక్కటి నవీన్ కుమార్ వ్యక్తి నాకు పరిచయం అవ్వడం వల్ల ఈ వ్యవస్థని ప్రారంభం చేయాలనీ ఆలోచన రావడం జరిగింది. అదే విధంగా నవీన్ కుమార్ అనే వ్యక్తి వ్యవస్థని రూపొందించి ఇవాళ ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టడం జరిగింది మొన్న వరంగల్ జిల్లాలో భద్రకాళి దేవాలయం దేవాలయంలో చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా శాకాంబరి ర్యాలీ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఆ జన స్పందన చూసినంక నాకు అనిపించింది నవీన్ కుమార్ అనే వ్యక్తి ఉండడం వల్ల అందరి సహకారాలు తీసుకుంటూ అందరి గురించి ఆలోచించే వ్యక్తి ఈ ట్రస్ట్ లో ఉండడం వల్ల ఇంత ముందుకు సాగుతుంది ట్రస్ట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజులలో ఎవరిది వారి మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ నవీన్ కుమార్ అనే వ్యక్తి అలా కాకుండా అందరి గురించి ఆలోచిస్తున్నాడు ఎప్పటికైనా నిరంతనం వ్యవస్థ గురించి ఆలోచించి వ్యవస్థకు మంచి పేరు వచ్చే విధంగా వ్యవస్థ ప్రారంభం మించినందుకు వ్యవస్థాపకులకు నా కూడా మంచి పేరు వచ్చే విధంగా ఏ ప్రోగ్రాం చేసిన కూడా నన్ను గుర్తు పెట్టుకొని మరి నన్ను పిలవడం జరుగుతుంది అదేవిధంగా నా చిన్ననాటి మిత్రుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఏఈఓ గోపాలరావు గారిని కూడా నన్ను లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ గారు కలిపేయడం జరిగింది నాకు చాలా సంతోషకరం కానీ ఎండాకాలంలో కొన్ని వందల మంది కూడా మన లక్ష్యం వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం కరోనా సమయంలో మొదలైనవి చానా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ యొక్క వ్యవస్థ ప్రారంభం మించినందుకు మీ అందరి సహకారంతోటి ఇంత మంచి జన స్పందన వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా

Member 11

K SUDHKAR

జై శ్రీమన్నారాయణ మొట్టమొదటిగా నేను తిరుమల తిరుపతి దేవస్థానం కి శ్రీవారి సేవకు వెళ్లి రావడం జరిగింది. అక్కడికి వెల్లి వచ్చాక మన మహబూబాబాద్ లో కూడా ఒక వ్యవస్థ సేవా ట్రస్ట్ ప్రారంభించాలని ఆలోచన రావడం జరిగింది. అక్కడ చేసి రావడం వల్ల 7 రోజులు మాత్రమే సేవ చేసే భాగ్యం మనకు లభిస్తుంది మహబూబాబాద్ లో ఒక వ్యవస్థ ప్రారంభం నుంచి కొన్ని లక్షల మందికి సేవ అవకాశాలు కల్పించాలని అర్వపల్లి వీరయ్య మరియు కొదుమూరి సుధాకర్ వారికి ఆలోచన రావడం జరిగింది వారిఆలోచన మేరకు లక్ష్మీ వెంకటేశ్వర సేవ ట్రస్ట్ అనే పెట్టడం జరిగింది 2015 మార్చ్ 21వ తారీకు ప్రారంభించడం జరిగింది మొదటి ప్రెసిడెంట్ గా కోదుమూరి సుధాకర్ గారూ మొదటి సెక్రటరీ గా అర్వపల్లి వీరయ్య గారూ treasure గా శ్రీరంగం నరసింహారావు గారూ మరియు vice President గా గరిపెల్లి నవీన్ గా బాధ్యతలు తీసుకున్నారు ఇప్పటివరకు చాలా దేవాలయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సేవా ట్రస్ట్ వల్ల కొన్ని వేల మందికి సేవ అందించే భాగ్యం దక్కింది ఎందుకంటే మనము వెళ్లి సేవ చేసిందానికన్నా మనం పదిమందికి సేవ చేయడం వల్ల చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క సేవా ట్రస్ట్ వల్ల దేవుడి దగ్గరికి అతి దగ్గరలో చూడడమే గాని సేవ చేసుకునే భాగ్యమే గాని సేవకు వచ్చిన ప్రతి ఒక్కరికి అందుతుంది ఇవాళ మన లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ వల్ల చాలా దేవాలయంలో చాలామందికి సేవకు అవకాశం మా లక్ష్మి వెంకటేశ్వర ఒక సేవే మార్గం కాకుండా మన వ్యవస్థలో ఎవరికీ ఎలాంటి సమస్య వచ్చినా నేను ఉన్నాను అంటూ ముందుకు వెళ్తాను ఎందుకంటే మా వ్యవస్థలో ఉన్న వారందరుడా ఒక అక్క చెల్లి తమ్ముడు అనే భావంతోటి అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాము గత పది సంవత్సరాల నుండి 400 ప్రోగ్రామ్స్ నాలుగు లక్షల మందికి అవకాశం ఇవ్వడం జరిగింది ఇవాల్టి వరకు చాలా గర్వకారణం ఇంత పెద్ద ట్రస్టులో నేను స్థాపించాలని అలోచన కు సంతోషంగా వుంది నా తోటి లీడర్స్ అందరి సహకారంతోటి ఎన్నో ప్రోగ్రామ్స్ కరోనా మహమ్మారి టైంలో మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టులో సేవ చేసిన వారికి ఏ ఒక్కరు కూడా కరోనా అనే సోకలేదు ఎందుకంటే వారందరూ స్వామి సేవలో ఉన్నారు కాబట్టి ఆపదలో ఉన్నప్పుడు కార్మికులకు మా లక్ష్మి వెంకటేశ్వరా సేవా ట్రస్ట్ ద్వారా నాలుగు నెలల పాటు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఇదొక వ్యవస్థ ఉన్నందుకు మాతోటి ఉండే టీం లీడర్స్ అందరి సహకారంతోటి వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన భద్రకాళి దేవస్థానం కాడ ఒక సేవాసద నిర్మించడం జరిగింది. కొన్ని వందల మందికి ఆడొక ఉండడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా ఇవాల్టి వరకు ఏ ఒక్కరు కూడా చేయని విధంగా మన లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టు ద్వారా ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది 2024వ సంవత్సరం జూలై 20 తారీకు రోజున ఇంత చక్కటి అవకాశాలు మరెన్నో కార్యక్రమాలు చేయడానికి మా లక్ష్మి వెంకటేశ్వర సేవా ట్రస్ట్ లీడర్స్ మాతో పాటు వచ్చే లీడర్స్ అందరి సహాయ సహకారాలతోటి చానాకార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మా లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టు ద్వారా ఎక్కడికి వెళ్లినా సేవకులు క్రమశిక్షణగా సేవ చేస్తారు హుండీ లెక్కింపులో పాల్గొనేటప్పుడు కూడా క్రమశిక్షణగా పాల్గొంటారు అదేవిధంగా మా లక్ష్మి వెంకటేశ్వర సేవా ట్రస్టు ద్వారా మేము చేసే కార్యక్రమానికి తోడుంటారు సేవా ట్రస్ట్ లో ఉన్న వారందరూ కూడా చానా అదృష్టవంతులు ఎందుకంటే ఇంత మంచి స్వభావం ఉన్నవారు మహాసేవ ట్రస్ట్ లో ఉండడం మేము ఎన్నో జన్మల చేసుకున్న పుణ్యం అని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏ ప్రోగ్రాం వచ్చినా కూడా మేము అందరం కూడా కలిసి చేయడం జరుగుతుంది

Member 12

S NARSHIMA RAO

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ స్థాపించినవారు అరవపల్లి వీరయ్య గారు 2015 లో దీనిని సాధించటం జరిగింది అప్పుడు 30 మంది సభ్యులతో ఈ సమస్తకొనసాగిస్తూ ఈరోజు వరకు 3,000 మంది సేవన అందిస్తున్నారు. ఈ సేవా సంస్థలో ఉండి లెక్కింపుకార్యక్రమాలు మరియు కరోనా సమయంలో 1500 మందికి నిత్యవసర సరుకులు అందించడం జరిగింది. ఈ సేవా ద్వారా తెలియని విషయాలు ఎన్నో సేవా కార్యక్రమంలో మేము తెలుసుకున్నాము నేను ఈ సంస్థలో ట్రెజరర్ గానాదొరకటం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ సంస్థ ద్వారా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని అంత మంచి దర్శనాలు జరగటం మా అదృష్టంఈ సమస్త ఉండి లెక్కింపుకార్యక్రమాలలో మేడారం భద్రకాళి టెంపుల్ అయినవోలు పాలకుర్తి మరియు కొరివి ఇంకా చాలా దేవస్థానంలో ఈ సంస్థ హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనుచున్నది ఈ సంస్థకు ఇప్పుడుగర్ పెళ్లి నవీన్ కుమార్ గారు ప్రెసిడెంట్గా అతను ఎన్నో ఇంకా మరెన్నో సేవలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇట్లు శ్రీరంగం నరసింహారావు గారు

Member 13

NOMULA SUJATHA

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్ట్ లీడర్స్ కి సేవకు వచ్చే వారందరికీ నా నమస్కారములు. నా పేరు నోముల సుజాత మాది మహబూబాబాద్ నేను మొదటిసారిగా నవీన్ తో తిరుపతికి సేవకి వెళ్ళాము అదే ఫస్ట్ టైం తిరుపతికి తీసుకు వెళ్లడం జరిగింది తర్వాత నవీన్ ఒక ట్రస్ట్ ను స్థాపించాలని అనుకున్నాడు చాలామందికి అవకాశం ఇవ్వాలని అనుకోవడం జరిగింది దాంతో నాకు నవీను ఈఅవకాశాన్ని కల్పించినాడు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను నాకు ముందుగా సభ్యురాలుగా చేర్చుకున్నాడు తర్వాత వైస్ సెక్రటరీగా నాకు పోస్ట్ ఇచ్చినాడు నేను దాన్ని మూడు సంవత్సరాలు చేసినాను ఈ సంస్థ అనేది 2015 మార్చి 21న స్థాపించడం జరిగింది చాలా దేవాలయంలో సేవకి మరియు లెక్కింపు లకి పోవడం జరిగింది ఈ లెక్కింపులో చాలా సంతోషంగా ఉండేది అందరూ అక్కా చెల్లెలు అన్నాచెల్లెళ్ల కలిసిమెలిసి ఉండడం జరిగింది. ఈ గుళ్లను దర్శనాలు అయితే చాలా బాగా జరిగేవి నేను కూడా కొంతమందిని పరిచయం చేశాను వాళ్లు కూడా లీడర్లు అయ్యారు నాకు చాలా సంతోషం అయింది వాళ్లకి కూడా నా కృతజ్ఞతలు చెప్తున్నాను కరోనా టైంలో కూడా మా లక్ష్మి వెంకటేశ్వర సేవా ట్రస్టు ఉన్నది అనే ధైర్యంతో ముందుకు పోయాము మా ఎవరికి కూడా కరోనా రాలేదు వారందరికి కూడా భోజనాలు గానీ పండ్లు కానీ నిత్యవసర వస్తువులు కానీ ఇవ్వడం జరిగింది ఎండాకాలంలో మజ్జిగ పంపిణీ జరిగింది ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది అయినవోలు కొమ్మాల కొరివి గుండేడు ముసలమ్మ పాలకుర్తి మర్రిపేడా వెంకటేశ్వర స్వామి ఇంకా చాలా చాలా టెంపుల్స్ లో లెక్కింపుకు వెళ్తాము వరంగల్ జిల్లాలో ప్రసిద్ధి చెందిన భద్రకాళి దేవస్థానంలో కూడా శుక్రవారం గాని సోమవారం కానీ మంగళవారం కానీ రోజు సేవకి అవకాశం ఇవ్వడం జరిగింది కొరివిలో కూడా సేవా కు అవకాశం రావడం జరిగింది అనంతరంలో కూడా సేవకి వెళుతూ ఉంటాము భద్రకాళిలో ర్యాలీ 3000 మందితో ర్యాలీ జరిగింది ఒక సేవా సదను కూడా కట్టడం జరిగింది ఇదంతా కూడా నవీను ప్రోత్సాహంతో జరిగింది అందరికీ మంచి జరగాలని చూస్తాడు రాఖీ సెలబ్రేషన్ కూడా చేసుకుంటాము ఈ అవకాశాలన్నీ కల్పించిన నవీన్ కి మా కృతజ్ఞతలు జనవరి 26 ఆగస్టు 15 ఫ్లాగ్ ఎగిరేయడం జరుగుతుంది నాకు ఇప్పుడు ముఖ్య సలహాదారిగా పదవి ఇచ్చినారు వారికి కృతజ్ఞతలు నా తోటి లీడర్స్ అందరికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాను🙏🙏🙏

Member 14

B URMILA

జైశ్రీరామ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టులో ఉన్న లీడర్స్కు గాని మరియు సభ్యులకు గానీ అందరికీ నా యొక్క ధన్యవాదములు నా పేరు బొడ్డు పెళ్లి ఊర్మిళ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టులో చేరడానికి కర్లపాటి కృష్ణారావు అంకులు గారు నన్ను సేవా ట్రస్టులో చేర్పించడం అనేది జరిగింది. కొన్ని రోజులు సభ్యురాలుగా చేశాను నా సేవలను గుర్తించి గరిపెల్లి నవీన్ కుమార్ గారు నాకు ఒక లీడర్ పదవి ఇవ్వడం అనేది జరిగింది పదవి పేరు ప్రోగ్రాం కన్వర్గా మూడు సంవత్సరాలు చేశాను తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగాలేక డాక్టర్ రెస్టు తీసుకోవాలి అన్నారు కాబట్టి సేవలు అందించలేకపోయాను కొన్ని రోజుల కాంచి సేవకు రాలేకపోతున్నాను నవీన్ గారికి చెప్పడం అనేది జరిగింది ఏమిటి అని అంటే నవీను లీడర్ పోస్టుని నేను తీసుకోలేను నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను రాలేను అని చెప్పాను పర్వాలేదు ఆంటీ ఫస్ట్ ఆరోగ్యమే ముఖ్యము ఆరోగ్యం బాగుంటేనే ఏసేవైనా చేయొచ్చు అని అన్నాడు అలాగే ఎన్ని సంవత్సరాలు సేవ చేశారు కదా ఆంటీ గారు మీరు ముఖ్య సలహాదారిగా ఉండండి అని చెప్పడం జరిగింది అలాగే నవీన్ గారు అని చెప్పాను కానీ సేవ చేయాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి ఇలాంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టు అనేది చాలా గర్వకారణము ఎందుకంటే మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా ట్రస్టులో అందరికంటే చిన్నవాడైనా నవీన్ కుమార్ గారి ఎన్ని ప్రోగ్రామ్స్ అయినా ఎంతటి కష్టమైనా కూడా అన్నిటినీ ఈజీగా అందరితో చర్చించి అన్ని సేవలలో పాల్గొని చేయడం అనేది జరుగుతుంది ఏంటి అంటే అవి మనము భద్రకాళి టెంపుల్ లో టెంపుల్ లో ర్యాలీ చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో మన సేవా ట్రస్టు పెట్టి 9 సంవత్సరాలు అవుతుంది 9 సంవత్సరాల లో అంగరంగ వైభోగంగా ఈ సంవత్సరంలో 3000 మందితోనే పోచం మైదానం నుండి భద్రకాళి టెంపుల్ వరకు ర్యాలీ చేయడం అనేది కూరగాయలతోనే చాలా గర్వకారణం అలాగే మనము వరంగల్ భద్రకాళి గుడి పక్కన కంటైనర్ కూడా కట్టడం అనేది జరిగింది సేవకుల కోసం అందరి సాయి సహకారంతోనే ఆ కంటైనర్ కూడా కట్టడం అనేది జరిగింది ఎంత ఆనందకరము అంటే మాటల్లో చెప్పలేము ఆనందాన్ని అంతా స్వామి వారి దయ అమ్మవారి దయ మనం చేసిన సేవలు గుర్తించి అందరూ మనతోనే సేవకు వచ్చేవాళ్లు మన తోటి సభ్యులు లీడర్స్ అందరు అందరూ కూడా చక్కగా స్పందించి ఎలాంటి కోపతాపాలు లేకుండా చక్కగా చేవచేసే వాళ్ళము అలాగే ఆగస్టు 15 అలాగే 26 జనవరి నాదిస్టింగ్ ఏదైనా కూడా ఒక ఫ్యామిలీ లాగా జెండా ఎగరేసుకొని అందరం మంచి మనసుతోనే ఆనందకరంగా ఉండే వాళ్ళము ఎంత చక్కటి అవకాశాన్ని కల్పించిన గర్భిణీ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదములు